యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల స్వయం ఉపాధి కోసం రేవంత్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మొత్తం రెండు లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇక ఈ పథకంకు దరఖాస్తు చేసుకొనేందుకు చివరి తేదీ ఏప్రిల్ 5. ఆ తర్వాత ఏప్రిల్ 30వ తేదీ వరకు అప్లికేషన్లను అధికారులు పరిశీలిస్తారు. మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు అర్హుల జాబితాను జిల్లా స్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి మే21 నుంచి 31వ తేదీ వరకు యూనిట్లను మంజూరు చేస్తుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వం చెక్కుల పంపిణీని ప్రారంభించనుంది.
()వ్యవసాయేతర పథకాలకు లబ్ధిదారుల వయసు 2025 జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 55 ఏళ్లు ఉండాలి.
() వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
() దరఖాస్తుదారులు ప్రతిపాదించిన యూనిట్ ధర ఆధారంగా వివిధ స్థాయిలో సబ్సిడీ ఉంటుంది.
() రూ.50వేల యూనిట్లను 100శాతం సబ్సిడీ
() రూ.50వేల నుంచి రూ. లక్ష మధ్య ఉన్న యూనిట్లకు 90శాతం సబ్సిడీ
() రూ. లక్ష నుంచి రూ.2లక్షల వరకు యూనిట్లకు 80శాతం సబ్సిడీ.
() రూ. 2లక్షల నుంచి రూ.4లక్షల వరకు 70శాతం సబ్సిడీ లభిస్తుంది.
() రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు లోన్ల ద్వారా అందిస్తారు.
() కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తింపు
Also Read:మ్యాడ్ స్క్వేర్.. వసూళ్లు అదుర్స్!

