కార్యకర్తలే టీడీపీకి బలం: చంద్రబాబు

19
- Advertisement -

43 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, కార్యకర్తలకు జన్మంతా రుణపడి ఉంటాను అన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. పార్టీ 43వ వార్షికోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. దేశంలో సంక్షేమ యుగాన్ని తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని, ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారని చంద్రబాబు పేర్కొన్నారు.

పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజానికానికి, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. వివిధ వర్గాల ప్రజలు రకరకాల పండుగలు జరుపుకుంటారు. కానీ అన్నివర్గాల వారు జరుపుకునే పండుగ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. నాలుగు దశాబ్దాలుగా పార్టీతో నడుస్తున్న నాయకులు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అన్నారు.

ఏ పార్టీకి లేనటువంటి సిద్ధాంతాలతో మనం ముందుకెళ్తున్నాం. పదవులు, అధికారం కోసం కాకుండా తెలుగుజాతిని అన్ని విధాలా మందుంచాలన్న లక్ష్యంతో ప్రజలే ముందు అనే విధంగా పని చేస్తున్నాం అన్నారు. పసుపు జెండా అంటే ఒక స్ఫూర్తి. టీడీపీ ఆవిర్భావం ముందు, ఆ తర్వాత అన్న విధంగా తెలుగుజాతిని చూడాలి అన్నారు.

Also Read:మోదీపై ట్రంప్ ప్రశంసలు..

2019 తర్వాత దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, బెదిరిపుంలు, అరెస్టులు వంటి చర్యలతో భయోత్పాతం సృష్టించిన కార్యకర్తలు జెండా వదల్లేదు.. గొంతుపై కత్తిపెట్టి చంపుతామన్నా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలారంటే…అలాంటి కార్యకర్తలు ఉండటం పార్టీకే గర్వకారణం అన్నారు. 43 ఏళ్ల చరిత్రలో ఎంతో మంది నాయకులను పోగొట్టుకున్నాం… పరిటాల రవి, ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా, బాలయోగి, కోడెల శివప్రసాద్ లాంటి గొప్ప నాయకులను కోల్పోయాం అన్నారు.

- Advertisement -