టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆవిర్భావ సభను ప్రారంభించారు. మంత్రి లోకేశ్ , రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస యాదవ్ , పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు..
తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అంటే 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించింది. ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ 294 సీట్లలో 202 గెలుచుకుంది. ఈ విజయం భారత రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించింది.
ఇక ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని, ఎన్టీఆర్ విజయ ప్రస్థానం, సీఎంగా చంద్రబాబు సాధించిన విజయాలకు సంబంధించిన వీడియోలను జిల్లా వ్యాప్తంగా ప్రదర్శించాలని ఆదేశించింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరుగగా 6 సార్లు అధికారంలో… 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది.
Also Read:మయాన్మార్ భూకంపం..పెరుగుతున్న మృతుల సంఖ్య

