అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం Kart**. అర్యన్, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి సంబంధించి, సిలిగురి (పశ్చిమ బెంగాల్) లో జరుగుతున్న షూటింగ్ నుండి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
కార్తిక్ ఆర్యన్ మరియు శ్రీలీల షూటింగ్‌లో పాల్గొంటున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. భూల్ భులయ్యా 3 నటుడైన కార్తిక్ రగ్గడ్ లుక్‌లో, పొడవైన జుట్టుతో కనిపించగా, శ్రీలీల హిప్పీ స్టైల్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతూ కనిపించారు. వీరి లుక్ చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా దీపావళి 2025 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కార్తిక్ ఆర్యన్ ఇటీవలే దీపావళి బ్లాక్‌బస్టర్ భూల్ భులయ్యా 3 లో కనిపించగా, శ్రీలీల పుష్ప 2: ది రూల్ లోని ‘కిస్సిక’ పాటతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
Also Read:IPL 2025:హైదరాబాద్‌పై లక్నో గెలుపు

