తులం బంగారం ఏది?:ఎమ్మెల్సీల నిరసన

10
- Advertisement -

శాసనమండలి ఆవరణలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని వినూత్నంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన చేశారు.

తక్షణమే తులం బంగారం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఇప్పటివరకు పెళ్లయిన వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.

తులం బంగారం కోసం ఆడపిల్లల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారని తెలిపారు.

Also Read:పెద్దన్న లెక్క భట్టిని గౌరవిస్తా: కేటీఆర్

 

 

- Advertisement -