తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 3న కేబినెట విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంద.ఇ ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇప్పటికే సంబంధిత నేతలకు సంకేతాలు కూడా పంపినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కించుకున్న వారిలో రాజగోపాల్, సుదర్శన్, వివేక్ పేర్లు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే వాకాటి శ్రీహరి..మరో స్థానం కోసం ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య రేసులో ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే అఫిషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే చాలామంది నేతలు ఆశలు పెట్టుకోగా అవకాశం దక్కని వారు తమ అసంతృప్తిని ఏ విధంగా వెల్లగక్కుతారోనని ఆ పార్టీ నేతలు బయపడుతున్నారు. ఎందుకంటే సీనియర్ నేతలు బహిరంగంగానే తమ మనసులోని మాటను బయటపెట్టారు. ఈ క్రమంలో ఛాన్స్ దక్కని వారు ఖచ్చితంగా తిరుగుబాటు ఎగరవేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిని హస్తం పార్టీ నేతలు ఏ విధంగా అధిగమిస్తారో వేచిచూడాలి.
Also Read:తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్

