ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. టీడీపీ హయాంలో రూ.43 వేల కోట్ల టెండర్లు ఆహ్వానించగా, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆల్ ఇండియా సర్వీస్ భవనాలు దాదాపు పూర్తయ్యాయి.
కానీ, వైసీపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. ఐఐటీ మద్రాస్‌తో భవన నాణ్యత పరిశీలించి, కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించామని, 15 రోజుల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు. అర్చకుల గౌరవ వేతనం రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచాం.. నాయీ బ్రాహ్మణులకు రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచాం అన్నారు. ఇమాంలకు, మౌజన్లకు గౌరవ వేతనం పెంచాం.. చేనేతలకు జీఎస్టీ ఎత్తేసాం అన్నారు.
చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. గీత కార్మికులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చాం అన్నారు. గృహ నిర్మాణానికి అదనంగా ఇస్తున్నాం….స్కూళ్లు ప్రారంభానికి ముందే.. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ఒక్కొక్కరికి 15000 చొప్పున తల్లికి వందనం పథకం కింద అందిస్తాం అన్నారు.
Also Read:హోంశాఖ అంటే ఇష్టం..కోమటిరెడ్డి మనసులో మాట

