పల్లెలు నాడు కేసీఆర్ పాలనలో ప్రగతి బాట పడితే.. నేడు 15 నెలల కాంగ్రెస్ పాలనలో అధోగతి బాట పట్టాయన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అమ్మ పెట్టదు.. అడుక్క తిననివ్వదు.. అన్న చందంగా కాంగ్రెస్ పాలన ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. 14 నెలలుగా సర్పంచులు లేక కేంద్రం నుండి నిధులు ఆగిపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పాలనలో పల్లెలన్నీ ధ్వంసమవుతున్నాయని ..పల్లెలను పట్టించుకునే నాథుడు లేడు అని విమర్శించారు. నాడు పచ్చబడ్డ పల్లెలు.. నేడు ఎండుతున్నాయి. తాగునీటికి గోస వచ్చిందన్నారు. వీధి దీపాలు వెలగడం లేదన్నారు.
నాడు గ్రామాల కోసం పల్లె ప్రగతి.. పట్టణాల కోసం పట్టణ ప్రగతి నిర్వహించామని కేటీఆర్ తెలిపారు. హరితహారంలో మొక్కలు నాటించి గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం నిర్వహణ, మొక్కల సంరక్షణకు ట్రాక్టర్ల ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో దేశానికే అదర్శంగా నిలిచి అవార్డులు అందుకున్న తెలంగాణ పల్లెలు.. నేడు కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యంతో నిధులు లేక వెల వెలబోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ..షెడ్యూల్ రిలీజ్

