ఉగ్ర చోరబాటు..రజనీకాంత్ హెచ్చరిక

12
- Advertisement -

సముద్రతీర ప్రాంత వాసులను హెచ్చరించారు సినీ నటుడు రజనీకాంత్. ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా చొరబాట్లు చేయబోతున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ప్రజలను కోరారు.

ప్రతి ఒక్కరూ దేశ రక్షణలో భాగస్వాములైందని, ఉగ్రదాడులపై నిఘా పెట్టడం మన బాధ్యత అని రజనీ అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) జవాన్లు ప్రత్యేకంగా 7 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు రజనీకాంత్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు 100 మంది జవాన్లు ఈ యాత్రను నిర్వహించనున్నారు.

ఉగ్రవాదులు సముద్ర మార్గాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ, ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని రజనీకాంత్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ భద్రతపై అవగాహన పెంచుకొని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే తక్షణమే పోలీసులకు తెలియజేయాలి అన్నారు.

Also Read:ముంబైపై చెన్నై…రాజస్థాన్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ గెలుపు

- Advertisement -