ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఆసక్తికర మ్యాచ్‌లు జరిగాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ముంబై జట్టును ఓడించింది. ముంబై విధించిన 156 పరుగుల టార్గెట్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి ఛేదించింది.
ఇక మరో మ్యాచ్‌లో పరుగుల వరద పారించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2025లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేశాడు ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ 45 బంతుల్లో సెంచరీ బాదగా ట్రావిస్ హెడ్ సైతం విశ్వరూపం చూపించాడు. ఇషాన్ కిషన్ 106 నాటౌట్ (47 బంతులు, 6 సిక్సులు, 11 ఫోర్లు) రాణించడంతో ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 286/6 స్కోరు చేయగా ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోరు.
తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ సైతం ధాటిగా ఆడింది. అయితే లక్ష్యం భారీగా ఉండటంతో చేధించలేకపోయింది. సంజూ శాంసన్ 66 పరుగులు చేయగా జురేల్ 35 బంతుల్లో 40 పరుగులు చేశారు. దీంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 242 పరుగులు చేసింది.
Also Read:IPL 2025 :బోణీ కొట్టిన బెంగళూరు..