బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 20 మందికి పైగా సెలబ్రెటీలపై కేసులు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు.
అయితే తాజాగా ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు యాంకర్ శ్యామల. బెట్టింగ్ కేసులో తన మీద నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో శ్యామలపై కేసు నమోదైంది. దీనిని ఇవాళ విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.
బెట్టింగ్ యాప్ వ్యవహారంలో నటులు దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లతో పాటు బుల్లితెర నటి, యాంకర్ శ్యామలపైకూడా కేసు నమోదైంది. అలాగే విష్ణు ప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత, శ్రీముఖి, వర్షిణి, సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతా చౌదరి, నయని పావని, నేహాపఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి.
Also Read:మోదీ విదేశీ పర్యటనల ఖర్చెంతో తెలుసా?

