మెక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయంపై బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
బిల్ గేట్స్‌ను అమరావతి, తిరుపతికి రావాలని సీఎం చంద్రబాబు కోరగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని వెల్లడించారు సీఎం చంద్రబాబు.ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం తమ సమయం, ఆలోచనలు, మద్దతు ఇస్తున్నందుకు బిల్ గేట్స్ కు థ్యాంక్స్ చెప్పారు చంద్రబాబు.
ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఇద్దరి మధ్య చర్చ జరిగిందని చెప్పారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగ ఉపాధి కల్పన తదితర కీలక రంగాల్లో సేవలను మెరుగుపర్చడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతల వినియోగానికి ఉన్న అవకాశాలను చర్చించామని తెలిపారు.
స్వర్ణాంధ్ర ప్రదేశ్-2047 విజన్ ను సాకారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని… ఈ లక్ష్యాన్ని సాధించడంలో, ఏపీ ప్రజల సాధికారతను పెంచడంలో గేట్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నామని తెలిపారు.
Also Read:బడ్జెట్..ప్రజలకు దక్కేది గుండుసున్న: కేటీఆర్

