సీఎం రేవంత్‌ రెడ్డికి రిలీఫ్..

12
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో 2020 మార్చిలో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేశారంటూ రేవంత్ రెడ్డి, మరికొంత మందిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఈ కేసులో 2020 మార్చిలో రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రోన్ ఎగురవేసిన ప్రాంతం నిషిద్ధ జాబితాలో లేదని రేవంత్ తరపు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. నార్సింగి పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

ఇదే కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

Also Read:బడ్జెట్ ప్రసంగమా?.. రాజకీయ ప్రసంగమా?

- Advertisement -