ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి: కేటీఆర్

5
- Advertisement -

రుణ మాఫీ కాక, రైతు బంధు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. గోదావరి, కృష్ణ నదిలో నీళ్ళు సక్రమంగా వాడుకోలేక పంటలను సర్కార్ ఎండబెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కండ్లు తెరిపించేందుకు ఎండిన వరితో నిరసన తెలుపుతున్నాం అన్నారు.

సకాలంలో వర్షాలు పడ్డాయి, ప్రాజెక్టుల్లో నీళ్లు నింపలేదు.. మేడిగడ్డను ఎండబెట్టి సిగ్గు లేకుండా సర్కార్ ఇసుక అమ్మకాలు చేస్తోందని దుయ్యబట్టారు. 36 శాతం కృష్ణ జలాలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాడుకుంది.. చంద్రబాబు మీద ప్రేమతో కిందకు నీళ్లు వదిలి ఇక్కడ పంటలను కాంగ్రెస్ ఎండబెట్టింది అని ఆరోపించారు.

వరి పొలాల్లో మేకలు, గొర్రెలు మేస్తున్నాయి.. ఆరు కోట్లు ఇస్తే దేవాదుల పంపులు నీళ్ళు వదిలే అవకాశం ఉండే కానీ అందులో కమీషన్ రాదు కాబట్టి.. అవి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోంది అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు, ఎక్కడెక్కడ లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయో ఆ రైతులను సర్కార్ ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు.

చెరువులు నింపలేని తెలివి తక్కువదనం, పాడైన బరాజ్ రిపేర్ చేయకుండా నిర్లక్ష్యంతో ప్రభుత్వం సిగ్గు లేని చర్యలకు పాల్పడుతోంది.. పంటలు ఎండిపోయిన ప్రాంతాల్లో మేము పర్యటిస్తాం అన్నారు. ఎకరానికి రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు కేటీఆర్.

Also Read:TG Budget 2025-26: కేటాయింపులు ఇవే

- Advertisement -