72వ మిస్‌ వరల్డ్ పోటీలు..హైదరాబాద్‌లో

19
- Advertisement -

హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మే 7 నుంచి ప్రారంభమయ్యే అందాల పోటీ నిర్వహణ ఏర్పాట్లపై ఎల్లుండి బేగంపేట్ లో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

ఈ సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా తదితరులు హాజరుకానున్నారు.

మే 7 నుండి 31 వరకు అందాల పోటీలు జరగనున్నాయి. దాదాపు 125 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ అందాల పోటీల్లో పాల్గొననున్నారు.

Also Read:వీడియో..సునీతా విలియమ్స్‌ సేఫ్‌ ల్యాండ్‌

- Advertisement -