బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి భట్టి

16
- Advertisement -

బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా భట్టికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఇతర అధికారులు స్వాగతం పలికారు.

ఇక తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. ఉదయం 11:14 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు భట్టి. మండలిలో శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.

రూ 3.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ? ఉండగా ఏఏ శాఖలకు ఎంత కేటాయించారోనన్ను ఉత్కంఠ అందరిలో నెలకొంది.

Also Read:వీడియో..సునీతా విలియమ్స్‌ సేఫ్‌ ల్యాండ్‌

- Advertisement -