వీడియో..సునీతా విలియమ్స్‌ సేఫ్‌ ల్యాండ్‌

23
- Advertisement -

తొమ్మిదినెలల తర్వాత భూమిపై అడుగుపెట్టారు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌. స్పేస్‌ స్టేషన్‌ నుంచి మంగళవారం తిరుగుప్రయాణం అయిన వీరిద్దరూ.. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27కి ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు.

ఆస్ట్రోనాట్‌లను స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు.. ఊహించని సవాళ్లు, చారిత్రాత్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ సేఫ్ గా ముగియడంతో ఆనందం వెల్లివిరిసింది. 286 రోజుల తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ సురక్షితంగా భూమిపై అడుగుపెట్టారని నాసా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ల్యాండింగ్‌ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. సునీత క్షేమంగా భూమిపైకి రావడంతో భారత్‌లోనూ సంబరాలు అంబరాన్నంటాయి.

Also Read:వీడియో..అంతరిక్షం నుండి బయటకు సునీతా విలియమ్స్

- Advertisement -