డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, మంగళవారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ లోని ప్రమాదం సంభవించిన ప్రదేశంలో కి ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు మంగళవారం ఉదయం కేరళకు చెందిన కడా వర్ డాగ్స్ స్క్వాడ్ టన్నెల్ లోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలు పై సహాయక బృందాల ఉన్నతాధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యల వేగవంతానికి పలు సూచనలు చేసినట్లు వివరించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ యొక్క ఫ్లాట్ ఫాం భాగాలని కత్తిరించే పనులు వేగంగా జరుగుతున్నాయని,సమాంతరంగా టిబిమ్ పై నున్న మట్టిని తొలగించే పనులు రెట్టింపు వేగంతో సహాయక బృందాలు పూర్తిస్థాయిలో 24 గంటలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
టిబిఎం ను కత్తిరించిన భాగాలను ఎస్కవేటర్ ద్వారా తొలగిస్తూ,లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపిస్తున్నట్లు ,మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లు తెలిపారు. సహాయక బృందాల వారీగా సహాయక చర్యలు చేపడుతూ,సమన్వయంతో పనులు కొనసాగుతున్నాయని, తెలియజేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) అధికారులు టన్నెల్ ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించి, భూగర్భ నిర్మాణం, భూస్థాయిల మార్పులు, టన్నెల్ మట్టిపెళుసు స్థితి, నీటి ప్రవాహం, ప్రభావం, వంటి అంశాలపై అక్కడి భూగర్భ పరిస్థితులను విశ్లేషించారు. అధ్యయనం అనంతరం, వారు సహాయక చర్యలను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లేందుకు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారని, ప్రభుత్వ అధికారులు, రక్షణ సిబ్బంది, ఇంజినీర్లు, జియోలాజిస్టులు, మరియు అనుభవజ్ఞులైన రెస్క్యూ టీమ్‌లు సమన్వయంతో పని చేస్తున్నట్లు వివరించారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, డ్రిల్లింగ్ మెషిన్లు, సెన్సార్లు, రోబోటిక్ పరికరాలు వంటి సాధనాలను వినియోగించి సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ యంత్రాంగం, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీమ్, ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్,ర్యాట్ హోల్ మైనర్స్,కడావర్ డాగ్స్, హైడ్రా, అన్వి రోబోటిక్స్,దక్షిణ మధ్య రైల్వే, GSI, జలవనరుల శాఖ, మరియు ఇతర సంబంధిత విభాగాలు ఒకటిగా పని చేస్తూ సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.
Also Read:ఎస్సీ వర్గీకరణకు చట్టం..కాంగ్రెస్‌దే ఘనత: ఉత్తమ్

