Viral Video:నిద్రలో మహిళ..పైన భారీ పైథాన్!

14
- Advertisement -

అవును మీరు చూస్తోంది నిజమే. ఓ మహిళ నిద్రలోనుండి లేచే సరికి ఆమె పై నుండి పెద్ద పైథాన్ పాకుతూ వెళ్లింది. ఒక్కసారి ఏం జరుగుతుందో తెలియక ఆ మహిళ చావు భయంతో కేకలు వేసింది. అయితే అలా మహిళపై నుండి పాకుతూ వెళ్లిన ఆ పైథాన్ ఆమెను ఏం చేయకుండా అక్కడి నుండి వెళ్లింది. దీంతో ఆ మహిళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడింది.

అయితే ఈ వీడియో ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారింది. ఒళ్లు గగ్గురుపుట్టేలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.

కొంతమంది నెటిజన్లు ఆ సర్పం ఆ మహిళా పెంపుడు ప్రాణి అయి ఉండవచ్చని, ఆమె కేవలం లైక్స్, వ్యూస్ కోసం నటించిందని చెప్పగా మరికొంతమంది మాత్రం ఇది ఖచ్చితంగా ‘AI-జెనరేటెడ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

Also Read:లండన్‌లో చిరుకు గ్రాండ్‌ వెల్‌కమ్

- Advertisement -