అందాల పోటీలు ఎందుకు?: కేటీఆర్

25
- Advertisement -

అందాల పోటీలు పెట్టి రేవంత్ ఏం సాధించాలనుకుంటున్నారు? చెప్పాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్రం అప్పులపాలైందని చెప్పి, అందాల పోటీలా.. మింగ మెతుకు లేదు. మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుంది అందాల పోటీ కథ అన్నారు. రూ.46 కోట్లతో ఫార్ములా ఈ రేసు పెట్టి రాష్ట్రానికిి ఏం తెస్తామో చెప్పినా వినకుండా అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ ఇవాళ 250 కోట్లతో అందాల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు? అన్నారు.

ఆత్మహత్యలతో తల్లడిల్లుతున్న రాష్ట్రంలో అందాల పోటీలు ఎందుకు?, రేవంత్ జవాబు చెప్పాలి, కాంగ్రెస్ సమాధానం చెప్పాలి అన్నారు. అందాల పోటీలతో ఊరూరికీ బ్యూటీ పార్లర్ పెడతావా?, ఇప్పుడు అందాల పోటీలకు అంత ప్రాధాన్యత లేదు అన్నారు. కరెంట్ కోతలు, వ్యవసాయ సంక్షోభంలో రాష్ట్రం చిక్కుకుంటే, ప్రభుత్వం ఫోకస్ మొత్తం అందాల పోటీల మీద ఉంది అన్నారు.

ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కావడం లేదు… అడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని మోసం చేశారు?అన్నారు. ఫార్ములా ఈ వల్ల వచ్చిన లాభం నేను చెప్పిన.. ఏకపక్షంగా ఒప్పందం రద్దు చేసుకుని ఫార్ములా ఈ తో 46 కోట్లు పోవడానికి రేవంత్ కారణం అన్నారు. రద్దు చేస్తే డబ్బులు పోతాయని తెలిసినా, రేవంత్ కావాలనే రద్దు చేశాడు. ప్రజల డబ్బులు పోయేలా చేశాడు.. ఈ ఒప్పందం రద్దు చేయడంతో జరిగిన ప్రజల సొమ్ము నష్టంపై ప్రభుత్వంలోకి రాగానే విచారణ జరుపుతాం అన్నారు.

Also Read:బీసీ ప్రజాప్రతినిధులతో పొన్నం భేటీ

- Advertisement -