గల్లీలో హోదాను మరిచి తిట్లు – ఢిల్లీలో చిట్ చాట్లు.. ఇది రేవంత్ రెడ్డి పాలన అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. కాలు గడప దాటదు కానీ .. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి అన్నారు.
నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే .. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్ అని విమర్శించారు. 39 సార్లు ఢిల్లీ పోయి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప .. ఢిల్లీ నుండి సాధించిన పని .. తెచ్చిన రూపాయి లేదు అన్నారు.
రాహుల్ గాంధీతో నీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం .. మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి-ఊడితే మాకేంటి .. తెలంగాణకు ఒరిగేది ఏంటి అన్నారు. గ్రామ గ్రామాన, గల్లీ గల్లీల్లో మీకు ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే-చీమకుట్టినట్టు కూడా లేని నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్ అని ప్రశ్నించారు.
మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు .. ఆడ లేక పాతగజ్జెలు అన్నట్లు, హామీల అమలు చేతగాక గాలి మాటలు .. గబ్బు కూతలు అని విమర్శించారు.
Also Read:హరీష్ రావుకు హైడ్రా బాధితుల హోలీ విషెస్

