జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి

16
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. అసెంబ్లీ నుండి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం అంటే ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నమేనన్నారు.

రాష్ట్ర ప్రజలు, రైతులు, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన జగదీశ్ రెడ్డిని సభ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం నిర్వహించారు బీఆర్ఎస్ శ్రేణులు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై భగ్గుమన్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. కానాపూర్‌లో రేవంత్ డౌన్ డౌన్ అంటూ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, కాంగ్రెస్ నిరంకుశ విధానాలను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించిన మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌ను ఖండిస్తూ రేవంత్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఘట్‌కేసర్‌లో జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ, నిరాధార ఆరోపణలతో మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్‌ చేయడం దారుణం అంటూ నాగర్‌కర్నూల్‌లో నిరసన తెలిపారు.

Also Read:హరీష్ రావుకు హైడ్రా బాధితుల హోలీ విషెస్

- Advertisement -