ఓటీటీలోకి ‘బ్రహ్మా ఆనందం’

20
- Advertisement -

మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ తెరకెక్కించిన చిత్రం‘బ్రహ్మా ఆనందం’.ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు.

ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు.

ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి మార్కులు సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యింది. మార్చి 14 నేటి నుండి ఆహాలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.

Also Read:హరిహర వీరమల్లు.. రిలీజ్ డేట్ ఛేంజ్

- Advertisement -