ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్.. సైబర్ నేరగాళ్లు అరెస్ట్

10
- Advertisement -

న్యూడ్ వీడియో కాల్స్‌తో ఎమ్మెల్యే వేముల వీరేశంను బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు నల్గొండ పోలీసులు. నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు.

వారం క్రితం వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్ చేసి, ఆ తర్వాత వాట్సాప్ నెంబర్‌కు స్క్రీన్ రికార్డు పంపి డబ్బులు డిమాండ్ చేశారు నిందితులు. అంతేగాదు వేముల వీరేశం కాంటాక్ట్ నెంబర్లకు కూడా ఆ వీడియోలను పంపారు.

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వీరేశం. విచారణ చేపట్టిన పోలీసులు … మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో నిందితులను నకిరేకల్‌కు తీసుకొచ్చారు. ఇవాళ రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

Also Read:గద్దర్ సినీ అవార్డులు.. ఎంట్రీల ఆహ్వానం

- Advertisement -