లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ తోట గంగారాం మృతి చెందారు. తెలంగాణ సచివాలయంలో సీఎస్ఓగా పని చేశారు గంగారాం. జిల్లా కేంద్రంలోని ఒక అపార్ట్మెంట్ లో అర్ధరాత్రి లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడంతో కింద పడ్డారు గంగారాం.
మూడో ఫ్లోర్ నుంచి ఒకటో ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్‌పై పడ్డారు గంగారాం.. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. మృతుడికి భార్య రేఖ, కొడుకు సతీష్ కుమార్, ఇద్దరు కూతుళ్లు గౌతమి, మీనల్ ఉన్నారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గంగారాం స్వస్థలం. గంగారం మృతి పట్ల కవిత సంతాపం తెలిపారు. తెలంగాణ సచివాలయం మాజీ సీఎస్ఓ, నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు, సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం మృతి దిగ్బ్రాంతికరం అన్నారు.
పోలీసు శాఖ కు ఉత్తమ సేవలందిస్తున్న గంగారాం గారు లిప్టు ప్రమాదంలో మరణించడం బాధాకరం… వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గంగారాం గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు.
తెలంగాణ సచివాలయ మాజీ సీఎస్ఓ, సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు ఉన్నతంగా సేవలందిస్తున్న గంగారాం, ప్రమాదవశాత్తు లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Also Read:ఏపీలో 125 స్పెషల్ నీడ్ స్కూల్స్!

