రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ స్కూల్స్ ప్రారంభించనున్నామని తెలిపారు మంత్రి నారా లోకేశ్. అసెంబ్లీలో మాట్లాడిన లోకేశ్.. కేంద్ర బడ్జెట్లో కేటాయించిన నిధుల మేరకు ప్రతి మున్సిపాలిటీకి ఒక సెంటర్ చొప్పున మరో 125 కొత్త సెంటర్లను ప్రతిపాదించామని తెలిపారు.స్పెషల్ నీడ్స్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు అవసరాలను ఆసరాగా తీసుకుని కొన్ని ప్రైవేటు సంస్థలు వారి నుంచి రూ.50 వేల చొప్పున ఫీజులు వసూలు చేస్తున్నాయని నారా లోకేశ్ చెప్పారు. వీరి కోసం రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు నిర్వహిస్తున్నామని అన్నారు.
నూరు శాతం మంజూరవుతాయని బలంగా నమ్ముతున్నామని నారా లోకేశ్ అన్నారు. పిల్లలను, వారి కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. సభ్యులతో ఒక కమిటీ వేసి కొత్త టెక్నాలజీ, టీచింగ్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ప్రతి సెంటర్కు ఇద్దరు ఐఈఆర్పీల చొప్పున 1,358 మంది టీచర్లు ఉన్నారని నారా లోకేశ్ తెలిపారు. ఈ సెంటర్లలో 41,119 మంది రిజిస్టర్ చేసుకున్నారని అన్నారు.
Also Read:సునీతా విలియమ్స్ వచ్చేది అప్పుడే!

