సునీతా విలియమ్స్ వచ్చేది అప్పుడే!

28
- Advertisement -

అంతరిక్ష కేంద్రం నుండి సునీతా విలియమ్స్ వచ్చే తేది ఫిక్స్ అయింది. మార్చి 16న సునీతా విలియమ్స్‌ను భూమి మీదకు తీసుకువస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. స్పేస్‌‌‌‌‌‌‌‌ఎక్స్ డ్రాగన్‌‌‌‌‌‌‌‌లో వారిద్దరిని భూమిపైకి తీసుకురానున్నామని నాసా చెప్పింది.

వాస్తవానికి సునీతా విలియమ్స్‌ను మార్చి 19న భూమి మీదకు తీసుకువస్తామని నాసా ప్రకటించింది. అయితే తాజాగా ఆ తేదిని కాస్త ముందుకు జరిపింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేసుకున్నారు.

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఐఎస్‌ఎస్‌కి వెళ్లారు. తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు సునీతా. వీరిద్దరిని భూమి మీదకు తీసుకురావడానికి నాసా, స్పేస్‌ ఎక్స్‌ కలిసి పనిచేస్తున్నాయి.

Also Read:అసెంబ్లీ సమావేశాలు.. సీఎస్ రివ్యూ

- Advertisement -