నారీ శక్తికి వందనం.. మోదీ స్పెషల్ వీడియో

8
- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తికి వందనం అంటూ స్పెషల్ ట్వీట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మహిళా దినోత్సవం సందర్భంగా మన నారీ శక్తికి నమస్సులు! మహిళా సాధికారత కోసం మా ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉందని చెప్పారు.

మా పథకాలు, కార్యక్రమాలు దాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నేడు, నా సోషల్ మీడియా ఖాతాలను వివిధ రంగాల్లో ప్రతిభను చాటుతున్న మహిళలు నిర్వహించనున్నారు అని ప్రధాని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సత్తా చాటిన మహిళలు తమ అనుభవాలను వివరించారు. భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి, శాస్త్రవేత్తలు ఎలినా మిశ్రా , శిల్పి సోనీ సహా అనేక మంది మహిళా ప్రముఖులు ఈ వినూత్న కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ కలలను నిజం చేసుకోవాలంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించండి అని తెలిపారు వైశాలి.

Also Read:మహిళాసాధికారతకు బిఆర్ఎస్ పెద్దపీట: కేసీఆర్

- Advertisement -