మహిళాసాధికారతకు బిఆర్ఎస్ పెద్దపీట: కేసీఆర్

17
- Advertisement -

రాష్ట్ర మహిళలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్త్రీశక్తి ని కొనియాడారు. కుటుంబ వ్యవస్థను ముందుకు నడపడంలో మహిళల త్యాగం మహోన్నతమైనదన్నారు. దేశ సంపదను సృష్టించడంలో పౌరులుగా వారి పాత్ర గొప్పదన్నారు. ఎన్నో కష్టాలను అధిగమిస్తూ పురుషుడితో సమానంగా నేటి సమాజంలో స్త్రీ పోశిస్తున్న పాత్ర అమోఘమని తెలిపారు.

అవకాశాలిస్తే అబల సబలగా నిరూపించుకుంటుందన్నారు. పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో రాష్ట్ర మహిళాభ్యున్నతికోసం అమలు చేసిన పలు కార్యక్రమాలు వారి సాధికారతకు దోహదం చేయాశయని కేసీఆర్ గుర్తు చేశారు. మహిళల ఆరోగ్యం, సంరక్షణ, సంక్షేమం తో పాటు పలు కీలక అభివృద్ధి పథకాలల్లో మహిళకే ప్రాధాన్యతనిచ్చామన్నారు. వారి కేంద్రంగానే పథకాలను అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రగతిలో మహిళలను నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం భాగస్వామ్యం చేసిందన్నారు. అదే స్పూర్థిని కొనసాగిస్తూ మహిళాసాధికారతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. వారిని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని కేసీఆర్ తెలిపారు.

అలానే తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. బాలికలను ప్రోత్సహించండి. వారి సామర్థ్యాలపై విశ్వాసం ఉంచండి, వారు అద్భుతాలు చేస్తారు. నా జీవితంలో, నా తల్లిదండ్రులు తిరు రమేశ్‌బాబు మరియు తిరుమతి నాగలక్ష్మి నాకు గొప్ప మద్దతునిచ్చారు అని తెలిపారు.ఒడిశాకు చెందిన శాస్త్రవేత్తలు ఎలినా మిశ్రా మరియు శిల్పి సోనీ కూడా తమ సందేశాలను పంచుకున్నారు. భారతదేశం ప్రస్తుతం విజ్ఞాన శాస్త్రానికి అత్యుత్తమ వేదిక… మన దేశంలో మహిళలకు విస్తృతమైన అవకాశాలు లభిస్తున్నాయి అన్నారు. న్యూక్లియర్ టెక్నాలజీ వంటి రంగాల్లో సైతం మహిళలకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. అంతరిక్ష రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటంతో, భారత్ కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని.. భారత మహిళలు అసాధారణమైన ప్రతిభ కలిగి ఉన్నారని చెప్పుకొచ్చారు.

Also Read:సమగ్ర కుటుంబ సర్వేపై స్వతంత్ర హోదాతో కమిటీ

- Advertisement -