బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని దేవరకద్ర బీజేపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడిన మధుసూదన్.. ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ చూసి బీజేపీ నేతలు సంకలు గుద్దుకుంటున్నారు.. రాష్ట్రంలో అధికారంలో కి వస్తాం అని కిషన్ రెడ్డి, బండి సంజయ్ పగటి కలలు కంటున్నారు అన్నారు. ఇంకా పది ఏండ్లు తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా రెండు,మూడు సీట్లు కూడా బిజెపి కి రావు అన్నారు.
రాష్ట్రనికి రావాల్సిన నిధులను రాకుండా కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు అడ్డుపడుతున్నారు.. తెలంగాణ నిధులు రాకుండా అడ్డుపడుతున్న ద్రోహులు,కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికలు మేము పెద్దగా పట్టించుకోట్లేదు.. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిండు, గతంలో ఏపీలో బిజెపి 8ఎమ్మెల్సీ లు గెలిచారు.. ఏపీలో బిజెపి అధికారంలోకి వచ్చిందా? చెప్పాలన్నారు.
2018 ఎన్నికల్లో బిజెపి 103 సీట్లలో డిపాజిట్ కోల్పోయింది.. 2023 లో 68 స్ధానాలలో డిపాజిట్ రాలేదు అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులను తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఏరోజు బిజెపి ఎంపీలు తెలంగాణ నిధుల గురించి మాట్లాడలేదు అన్నారు.
Also Read:కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటం చేస్తాం:లక్ష్మణ్

