రాష్ట్రంలో RR ట్యాక్స్: హర్షవర్థన్ రెడ్డి

20
- Advertisement -

తెలంగాణలో కొత్త పెట్టుబడులు దేవుడెరుగు ఉన్న పెట్టుబడులు తరలి పోతున్నాయి అన్నారు బీఆర్ఎస్ నేత పుట్ట హర్షవర్థన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హర్షవర్థన్ రెడ్డి.. కేసీఆర్ హాయం లో పెట్టుబడులు వస్తే.. రేవంత్ పాలనలో పెట్టుబడులు తరలిపోతున్నాయి అన్నారు. కక్షపూరిత చర్యలు మానుకుని సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టాలి అన్నారు.

గర్వంగా చెప్తున్నాం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా ఉందని… కేసీఆర్ పాలనలో 9ఏళ్ళల్లో 4లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించారు అన్నారు. కాంగ్రెస్ పాలనలో మల్టీ నేషనల్ కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.. తెలంగాణలో అవినీతి, దోపిడీ, విధ్వంస పాలన నడుస్తోందన్నారు.

ప్రీమియర్ ఎనర్జీస్, అమరరాజ లాంటి కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి.. కాంగ్రెస్ పాలనలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారు అన్నారు. హైడ్రా వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుదేలైంది… గతంలో ఎల్ఆర్ఎస్ వద్దన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తోంది అన్నారు. రెవెన్యూ కోసం గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో 400ఎకరాలు అమ్మకానికి పెట్టారు అని మండిపడ్డారు.

Also Read:కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటం చేస్తాం:లక్ష్మణ్

- Advertisement -