RC16 సెట్స్‌లో కన్నడ స్టార్!

8
- Advertisement -

RRRతో గ్లోబ‌ల్ స‌క్సెస్‌ను సాధించి ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులను, సినీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు త‌న RC16 సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. తొలి చిత్రం ఉప్పెన‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ భారీ పాన్ ఇండియా సినిమాను వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు నిర్మిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంచ‌నాలు పెంచుతూ వ‌స్తోన్న ఈ సినిమాను భారీ స్థాయిలో హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా రూపొందిస్తున్నారు మేక‌ర్స్‌. క‌రుణ‌డ చ‌క్ర‌వ‌ర్తి శివ‌రాజ్‌కుమార్ ఈ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

శివ రాజ్ కుమార్ రీసెంట్ గానే కాన్సర్ చికిత్స నుంచి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. శివరాజ్‌ కుమార్ స్టన్నింగ్ లుక్ ని ప్రిపేర్ చేసి ఈ లుక్ టెస్ట్ తో ఫైనల్ చేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. శివన్న అతి త్వరలోనే సెట్స్ లో కూడా అడుగు పెడతారని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Also Read:Janasena: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

- Advertisement -