కేంద్రమంత్రి బండి సంజయ్ పై మంత్రి సీతక్క మండిపడ్డారు. గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. MLC ఎన్నికల్లో ఓటు అడిగి నైతిక హక్కు బీజేపీకి లేదు. పట్టభద్రులకు ఏం చేశారో బండి సంజయ్ చెప్పాలి. తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత ఉపాధి కల్పించారో చెప్పాలి అని సీతక్క డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ సెంటిమెంట్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన రిలీజ్ చేశారు. బండి సంజయ్ కేంద్రమంత్రిననే విషయం మర్చిపోయి కార్పొరేటర్లా మాట్లాడుతున్నారు. ఇండియా గెలవాలంటే బీజేపీకి, పాకిస్థాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నాం. దీనిపై ఈసీకి ఫిర్యాదుచేస్తాం అన్నారు.
Also Read;గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్

