హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 6వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో జె.శ్యామలరావు సోమవారం రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ, ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం అంకురార్పణ, ఫిబ్రవరి 26న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మార్చి 2న గరుడ వాహనం, మార్చి 5న రథోత్సవం, మార్చి 6న చక్రస్నానం నిర్వహించనున్నట్లు చెప్పారు.
శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్ధుతున్నారన్నారు.
అంతకుముందు ఈవో, ఆధికారులతో కలిసి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు.
Also Read:శివరాత్రి జాగారం, ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా?

