SLBC టన్నెల్ ప్రమాదంపై కవిత

18
- Advertisement -

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంపై ఎన్‌డీఎస్‌ఏ స్పందించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగింది? చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పై కప్పు కూలి కూలీలు గాయపడటం అత్యంత దురదృష్టకరం అన్నారు. కేసీఆర్‌ హయాంలో పది కి.మీ.ల మేర టన్నెల్‌ తవ్వారు. ఏ ఒక్క రోజూ ఇలాంటి ప్రమాదం జరగలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగు రోజుల కిందనే పనులు మొదలు పెట్టిందన్నారు.

అంతలోనే ఈ పెను ప్రమాదం ఎలా జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు? నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఈ ప్రమాదంపై స్పందించాలి. ఇంకా 9 కి.మీ.లకు పైగా టన్నెల్‌ తవ్వాల్సి ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్న అన్నారు కవిత.

Also Read:యూపీఐ యాప్స్‌తో పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా!

- Advertisement -