ఈ పాము గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..!

224
kobra sneck in kottagudem
- Advertisement -

కొత్తగూడెంలో పట్టుబడిన అత్యంత పురాతనమైన అరుదైన పాము అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చుంచుపల్లి మండలం రాంపురానికి చెందిన కొట్ల రాములు అనే రైతు పొలంలో కనిపించింది ఆ పాము.

ఆరు అడుగుల పొడవైన పామును పొలంలో చూసిన రాములు తొలుత ఆందోళనకు గురయ్యాడు. అయితే ఆ పాముకి మనలాగే కాళ్ళు ఆ కాళ్ళకి గోళ్ళు ఇన్నాయి. ఏంటీ..? పాముకి కాళ్ళు, ఆ కాళ్లకి గోళ్లు ఉండడం ఏంటని అనుమానంగా ఉందా? తొలుత రాములు కి కూడా అదే అనుమానం వచ్చిమో .

kobra sneck in kottagudem

ఇది ఇతర పాములకు భిన్నంగా ఉండడంతో ఆసక్తిగా దానిని గురించి ప్రాణధార ట్రస్టు సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆక్కడికి చేరుకున్న ప్రాణధార ట్రస్ట్‌ అధ్యక్షుడు సంతోష్, ఇతర సిబ్బంది పామును పట్టుకుని డీఎఫ్‌వో రాంబాబుకు అప్పగించారు.

వారు పామును పరిశీలించి అరుదైన జాతికి చెందిన కోబ్రాగా దీనిని గుర్తించారు. ఉన్నతాధికారులతో దీని గురించి చర్చించి దీనిని ఏం చేయాలో నిర్ణయిస్తామని వారు తెలిపారు. ఇది వందల ఏళ్ల క్రితం అంతరించిపోయిన అరుదైన సర్పమని వారు తెలిపారు.

- Advertisement -