35 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానంలో పుట్టాడు.. బంపర్ ఆఫర్ పొందాడు. సౌదీ అరేబియాలోని దమ్మమ్ నుంచి భారత్ లోని కొచ్చి వస్తున్న జెట్ ఎయిర్ వేస్ కి చెందిన 9 డబ్ల్యూ 569 విమానం 35 వేల అడుగుల ఎత్తులో ఉండగానే నిండుగర్భిణికి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఫ్లైట్ లో ఉన్న కేరళకు చెందిన నర్సు, విమాన సిబ్బంది కలసి సుఖ ప్రసవానికి సహాయపడడంతో ఆ తల్లి విమానాన్ని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత విమానాన్ని కొచ్చికి కాకుండా ముంబైకి మళ్లించి ల్యాండ్ చేశారు. తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించి, 90 నిమిషాలు ఆలస్యంగా వెళ్లి కొచ్చిలో ఇతర ప్రయాణికులను దించింది. జెట్ ఎయిర్ వేస్ సంస్థలో పుట్టిన తొలి బిడ్డ కావడంతో ఈ సంస్థ విమానాలలో జీవితాంతం ఉచితంగా ప్రయాణించేలా బర్త్ డే కానుకను ప్రకటించింది. ఆ బిడ్డ ఎప్పుడు ఎక్కడికి ప్రయాణించినా ఫ్రీ టికెట్ ఇస్తామని జెట్ ఎయిర్ వేస్ పేర్కొంది.
గతేడాది కూడా దుబాయినుంచి ఫిలిప్పీన్స్‌కు వెళ్తున్న సెబు పసిఫిక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో మహిళ ప్రసవం కారణంగా ఆ విమానం హైదరాబాద్‌లో అత్యవసరంగా దిగాల్సి వచ్చింది. విమానంలోనే కాన్పు కావడంతో పసిఫిక్ ఎయిర్‌లైన్స్ ఆ పసిబిడ్డకు తన జీవితకాలమంతా విమాన ప్రయాణాలన్నీ ఉచితంగా ఇచ్చిన విషయం తెలిసిందే.