మోసానికి బ్రాండ్ అంబాసిడర్‌.. రేవంత్ రెడ్డి!

20
- Advertisement -

మోసానికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అమన్‌గల్ రైతు దీక్షలో పాల్గొని మాట్లాడిన కేటీఆర్..రేవంత్ రెడ్డి నిజాయితీగ‌ల్ల మోస‌గాడు.. ప్ర‌జ‌లు మోస పోవాల‌ని కోరుకుంటారు.. మోస‌గాళ్ల‌ను న‌మ్ముత‌రు.. అందుకే మోసం చేస్తున్నాన‌ని అన్నారు.

తెలుగు భాష‌లో ఇన్ని తిట్లు ఉంటాయ‌ను కోలేదు. కొంద‌రు తిట్లను చూస్తే రోషం ఉన్నోడు అయితే పాడుబాడ్డ బావిలో దుంకి చ‌నిపోతేడు. సిగ్గు ల‌జ్జ లేని బ‌తుకు కాబ‌ట్టి బ‌తుకుతుండు రేవంత్ రెడ్డి. ఇన్ని తిట్లు తిన్న సీఎంను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు అని పేర్కొన్నారు.

కుల‌ణ‌గ‌న పేరిట బీసీల‌ను మోసం చేసిండు. 420 రోజుల్లో 430 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ స‌న్నాసికి గురుకులాల‌ను న‌డ‌ప‌డానికి వ‌స్త‌లేదు. గురుకులాల్లో 56 మంది పిల్ల‌లు చ‌నిపోయారు. దీన్ని బ‌ట్టి కాంగ్రెస్ పాల‌న ఎంత నికృష్టంగా ఉందో తెలుస్తుంది అని మండిప‌డ్డారు.

ప్ర‌పంచానికి అన్నం పెట్టే అన్న‌దాత‌కు కులం, మతం ఉండ‌దు. అన్ని వ‌ర్గాల్లో రైతులు ఉంట‌రు. 70 ల‌క్ష‌ల మంది రైతుల‌ను కేసీఆర్ క‌డుపులో పెట్టుకుని చూసుకున్న‌డు అన్నారు. ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం మాట ఇవ్వ‌క‌పోయినా.. 12 సీజ‌న్ల‌లో రూ. 73 వేల కోట్ల రైతుబంధు వేశాడు. రైతు చ‌నిపోతే ఆ కుటుంబం ఆగం కావొద్ద‌ని చెప్పి.. తొలిసారి స్వ‌తంత్ర భార‌త‌దేశ చ‌రిత్ర‌లో రూ. 5 ల‌క్ష‌ల బీమా ప్ర‌వేశ‌పెట్టిన నాయ‌కుడు కేసీఆర్ అన్నారు.

Also Read:తెలంగాణ బిల్లు పాసై 11 ఏండ్లు

- Advertisement -