కేసీఆర్..తెలంగాణకే హీరో: కేటీఆర్

3
- Advertisement -

మాజీ సీఎం, తెలంగాణ బాపు కేసీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తన తండ్రి బర్త్ డే సందర్భంగా పుట్టినరోజు విషెస్ చెప్పారు కేటీఆర్. ప్రతి తండ్రీ తమ పిల్లల హీరో అని అంటారు. నా తండ్రి నా ఒక్కడికే కాదు.. తెలంగాణ హీరో కావడం నా అదృష్టం. కల కనడం.. దాని కోసం హద్దులేని నిబద్ధతతో బయలుదేరారు అన్నారు.

విమర్శకులను ఎదుర్కోవడం, అది ఎలా నెరవేరుతుందో వారికి గర్వంగా చూపించారు. తెలంగాణ అనే కలను ప్రేమించారు. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా తెలంగాణ సాధించారు. మీరు గర్వంగా మీ కొడుకని పిలుచుకునే వ్యక్తి కావడమే నా లక్ష్యం. మీ వారసత్వానికి అర్హులుగా ఉండటానికి ప్రతీక్షణం కృషి చేస్తా అని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

 

Also Read;హ్యాపీ బర్త్ డే…బాపు కేసీఆర్

- Advertisement -