దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పూజా ఖేద్కర్‌కు రిలీఫ్ లభించింది. మార్చి 17 వరకు అరెస్టు చేయవద్దని తేల్చిచెప్పింది సుప్రీం కోర్టు. యూపీఎస్సీ పరీక్ష చీటింగ్ కేసులో ఐఏఎస్ ట్రైనింగ్ అధికారి పూజా ఖేద్కర్ ను అరెస్టు చేయవద్దు అంటూ మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది.
2022 యూపీఎస్సీ పరీక్షలో పూజా ఖేద్కర్ తప్పుడు కుల, అంగవైకల్య ద్రువపత్రాలు సమర్పించి ఐఏఎస్ శిక్షణ పొందిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణకు సహకరించాలని పూజాను సుప్రీం ధర్మాసనం కోరింది.
దర్యాప్తుకు రావాలని పోలీసులు పూజాను పిలవడం లేదని, విచారణ ఎదుర్కొనేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు న్యాయవాది సిద్ధార్థ తెలిపారు. ఈ కేసుపై మూడు వారాల్లోగా రిప్లై ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది.
Also Read:వెనక్కి రావాల్సిందే..అక్రమ వలసదారులపై మోదీ

