ఇదే అదిరిపోయే గిఫ్ట్ …

238
- Advertisement -

తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఘనత కాజల్ సొంతం. కాజల్ కథానాయికగా పరిచయమై పదేళ్ళు పూర్తయ్యాయి. సరిగ్గా పదేళ్ళ తర్వాత తనను వెండితెరకు పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో మరోమారు నటిస్తోంది కాజల్.

kajal birth day gist nene raju nene mantri

రాణా కథానాయకుడిగా తేజ తెరకెక్కిస్తున్న పోలిటికల్ థ్రిల్లర్ “నేనే రాజు నేనే మంత్రి”. కథానాయికగా కాజల్ నటిస్తున్న 50వ సినిమా ఇది. జూన్ 19న చిత్ర కథానాయకి కాజల్ పుట్టినరోజు సందర్భంగా “నేనే రాజు నేనే మంత్రి” సినిమా తనకు ఎందుకంత ప్రత్యేకమైన చిత్రమో కాజల్ తెలిపారు.

“నేనే రాజు నేనే మంత్రి” చిత్రంలో నేను రాధ అనే పాత్ర పోషిస్తున్నాను. నన్ను .. ‘లక్ష్మీ కళ్యాణం’తో కథానాయికగా పరిచయం చేసిన తేజగారి దర్శకత్వంలో దాదాపు పదేళ్ళ తర్వాత నటిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతోంది. నేను ఇప్పటివరకూ పోషించని ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాను.

 kajal birth day gist nene raju nene mantri
అలాగే రాణాతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. ప్రతి సన్నివేశం గురించి మాట్లాడుకొని పెర్ఫార్మ్ చేసేవాళ్లం. అన్నిటికంటే ముఖ్యంగా.. “నేనే రాజు నేనే మంత్రి” నా 50వ చిత్రం కావడం అన్నిటికంటే ప్రత్యేకమైన విషయం. నా పుట్టినరోజుకు ఇంతకు మించిన బహుమతి మరొకటి ఉండదు అంటూ “నేనే రాజు నేనే మంత్రి” సినిమా గురించి కాజల్ తన అనుభవాలను పంచుకొన్నారు.

- Advertisement -