- Advertisement -
మందుబాబులకు షాక్.. తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు పెరిగాయి. తెలంగాణలో బీర్ల ధరలను 15శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. పెరిగిన ధరలు నేటి నుండి అమల్లోకి వచ్చాయి. జైస్వాల్ కమిటీ సిఫార్సుల మేరకు బీర్ల ధరలు పెంచింది ప్రభుత్వం.
బీర్ల ధరలు సవరించాలని యునైటెడ్ బేవరేజస్, మరికొన్ని బేవరేజస్ గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అధికారులతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీర్ల ధరలపై 15శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇక ఏపీలోనూ మద్యం ధరలు పెరిగాయి. మద్యం షాపుల మార్జిన్ ను 14శాతానికి పెంచింది. 99 రూపాయల క్వార్టర్, బీర్ల ధరల మినహా మద్యం ధరలు పెరగనున్నాయి. బాటిల్ పై 10 రూపాయలు పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
Also Read:కేరళ, తమిళనాడుకు పవన్
- Advertisement -

