లైలా వివాదంపై విశ్వక్ సేన్

14
- Advertisement -

లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు “పృథ్వి చేసిన కామెంట్స్ పై లైలా” మూవీ యూనిట్ స్పందించింది. బాయికాట్ లైలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం చూసి షాక్ కి గురయ్యామన్నారు నిర్మాత గార్లపాటి సాహు.

అది మా నోటీస్ లో జరుగలేదు… సినిమాని అందరూ సినిమా గా చూడండన్నారు. గెస్ట్ లుగా వచ్చిన వాళ్ళు ఏమి మాట్లాడతారో మాకు తెలీదు అన్నారు.

మా ఈవెంట్ లో జరిగిన దానికి సారీ చెపుతున్నాను అన్నారు విశ్వక్ సేన్. సినిమాలో ఎవరో ఒక తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్టేనా..పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలీదు అన్నారు. అతను మాట్లాడిన దానికి సినిమాకు సంబంధంలేదు..పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియా లో వేల ట్వీట్స్ అంటే ఎలా సినిమా బ్రతకాలా లేదా చెప్పాలన్నారు.

మేము చిరంజీవి ని రిసీవ్ చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు అతను మాట్లాడాడు మా కంట్రోల్ లో జరుగలేదు… చాలా కష్టపడి తీసాము సినిమా ..నేను ఈ వివాదం గురించి ఇంతటితో ముగిస్తున్నాను.మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు అని విజ్ఞప్తి చేశారు.

Also Read:వీడియో..హైవేపై 8 పల్టీలు కొట్టిన కారు!

- Advertisement -