రీసర్వే చేయాల్సిందే: కులగణనపై కేటీఆర్

20
- Advertisement -

బీసీల జనాభాను కావాలనే కాంగ్రెస్ సర్కార్ తగ్గించిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బీసీ జనాభాను 5.5% తక్కువగా చూపించి కాంగ్రెస్ దగా చేసిందని.. కులగణన తప్పులతడక.. నివేదిక చిత్తుకాగితం అన్నారు. 22 లక్షల మంది లేనట్టుగా చూపడం దారుణం అని.. రీసర్వే చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.

సంక్షేమ పథకాల్లోనూ వారి వాటా తగ్గుతది.. చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ సాధ్యమేనన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ కు వాళ్లే తూట్లు పొడిచారు… కాంగ్రెస్ అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్తాం.. మండలాలు, నియోజకవర్గాలవారీగా భావజాలవ్యాప్తికి పటిష్ట చర్యలు చేపడుతాం అన్నారు.

బీసీలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి.. దీనిపై శాసనసభ, మండలిలో బీఆర్ఎస్ నిరసన తెలిపిందన్నారు. కులగణన తప్పుల తడక. చిత్తుకాగితంతో సమానం. బలహీనవర్గాల గొంతుకోసిన కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ వైఖరిని ఏ బీసీ బిడ్డ కూడా ఒప్పుకోవడం లేదని అసెంబ్లీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎండగట్టాం. మండలిలో మధుసూదనాచారి, అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్యాదవ్ నాయకత్వంలో బీఆర్ఎస్ సభ్యులు తమవాదన వినిపించారు. బీసీ జనాభాను తగ్గించి చూపెట్టి, బలహీనవర్గాలను తక్కువ చేసి చూపిస్తున్నారని నిరసన తెలిపాం అన్నారు.

Also Read:ప్రజలే విజేతలు..ఢిల్లీని అభివృద్ధి చేస్తాం

- Advertisement -