కేసీఆర్ సూచన మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశాం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. యుజిసి నిభంధనల మార్పు గురించి మా పార్టీ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలిపామన్నారు.
యూజీసీ నిబంధనల మార్పు గురించి మాకు అభ్యంతరాలు ఉన్నాయి.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ కి భాద్యతలు ఇవ్వడం సరికాదని తెలిపాం అన్నారు. విసిలుగా నిష్ణాతులుగా ఉండాలని సూచించాం.. గిరిజన విద్యార్థులకు నష్టం జరిగే విధంగా మార్పులు చేస్తున్నారు అన్నారు.
నో సుటబుల్ కండిడేట్ నిబంధన రాజ్యంగ విరుద్ధంగా ఉంది… ఫ్యాకల్టీ ఎంపికలో సీనియారిటీ ప్రకారమే కాకుండా సబ్జెక్టు పై అవగాహన ఉన్నవారికి సరైన విధానాలు పాటించాలని కేంద్రమంత్రిని కోరాం అన్నారు. NH 365 బి సిరిసిల్ల నుంచి కోరుట్ల వరకు పొడియోగించాలని,టూరిజం అభివృద్ధి చెందుతుందని గడ్కరిని కోరాం అన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్ సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 10వ తేదీన విచారణ జరగబోతోంది.. ఎమ్మెల్యేల పై వేటు పడాల్సిందే.. ప్రజలు ఉప ఎన్నికలు కోరుకుంటున్నారు అన్నారు. అనర్హత వేటు పిటిషన్ల పై న్యాయవాదలతో చర్చలు జరుపుతున్నాం అన్నారు.
Also Read:సరైన తిండి పెట్టు మేస్త్రి.. కేటీఆర్ సెటైర్

