కొడంగల్ నియోజకవర్గం కోస్గి లో జరిగే రైతు నిరసన ధర్నా (దీక్ష)కు హాజరుకానున్నారు బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు దిక్షకు మద్దతు తెలపనున్నారు కేటీఆర్. ఈ నెల 10వ తేదీన దీక్ష జరగనుంది.
కొడంగల్ లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం గడుస్తున్న చెప్పిన హామీలను ఎప్పటి వరకు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టి ముందుకు పోతుందని అన్నారు. జనవరి 26 జరిగిన చంద్రవంచ లో 4 పథకాలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా అర్ధరాత్రి 12 గంటల నుంచి రైతు ఖాతాలో రైతు భరోసా పడుతుందన్నారు.
15 నిమిషాల్లో మాట మార్చిన సీఎం రేవంత్ రెడ్డి…6 గ్యారంటీలను అమలు చేయాలని , ఒక పథకం తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ పథకంలో ఇప్పటివరకు అమలు కాలేదని అన్నారు.
Also Read:కాంగ్రెస్ బీసీల వ్యతిరేకి
రైతు భరోసా , ఆత్మీయ భరోసా, మహాలక్ష్మి పథకం, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, గ్యారంటీల పైన రైతు దీక్షల పైన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొడంగల్ నియోజకవర్గం కోస్గి లో పర్యటన ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు..
కొడంగల్ నియోజకవర్గం లో 8 మండల నుంచి రైతులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమానికి విజయవంతం చేయగలరని కోరారు… కేటీఆర్ పర్యటనకు భారీ బహిరంగ సభ ప్రతి ఒక్కరు విజయ్వంతం చేయాలని కోరారు…ఈ కార్యక్రమంలో లో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.