ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడాం అన్నారు మందకృష్ణ మాదిగ. ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ.. చాలా కమిషన్లు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి అన్నారు. మాదిగల జనాభాకు తగ్గట్లుగానే రిజర్వేషన్ల వాటా ఉండాలని విన్నవించాం.. వర్గీకరణను మాలలు అడ్డుకుంటున్నారు అన్నారు. న్యాయబద్ధంగా మాకు 11 శాతం వాటా రిజర్వేషన్లు రావాలన్నారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో మాకు 9 శాతమే దక్కుతుంది .. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5 శాతం ఇచ్చారు అన్నారు. 32 లక్షల జనాభా ఉన్న మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు రావాలి.. కమిషన్ సిఫార్సు చేసిన గ్రూపుల్లో కులాల కేటాయింపు సరిగ్గా లేదు అన్నారు. మాదిగల ప్రాతినిధ్యం పెరుగొద్దు.. మాలలు ప్రాతినిధ్యం పెరిగేలా ఉందన్నారు.
వివేక్ మాటలకు రేవంత్ రెడ్డి తలొగ్గారు.. మంత్రిగా దామోదర రాజనర్సింహ ఫైయిల్ అయ్యారు అన్నారు. మాదిగలకు రావాల్సిన వాటా తీసుకోలేదు.. దామోదర రాజనర్సింహ ను మంత్రిగా మేము చూడటం లేదు అన్నారు. దామోదర ఎందుకు మౌనంగా ఉన్నాడో చెప్పాలన్నారు. నువ్వు ఎవరి ప్రతినిధి వో తేల్చుకో.. నీ మౌనం,.. నీ చేతగాని తనం మాదిగలు క్షమించరు అన్నారు.
Also Read:TTD:అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు
దామోదర మంత్రి వర్గం నుంచి తప్పుకో… దామోదర ను మంత్రి వర్గం నుంచి తప్పించండి… రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మరో ఇద్దరు మాదిగాలను మంత్రి వర్గంలో తీసుకోవాలన్నారు. మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డికి తెలుసు.. లక్షల డప్పుల .. వేల గొంతుల కార్యక్రమానికి అనుమతి రాలేదు అన్నారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ఆపిందని… 7 న జరిగే లక్షల డప్పుల .. వేల గొంతుల కార్యక్రమం వాయిదా వేసుకున్నాం అన్నారు. తేదీ త్వరలో ప్రకటిస్తాం.. కానీ కార్యక్రమం మాత్రం తప్పకుండా నిర్వహిస్తాం అన్నారు.