బీసీల కోసం ఉద్యమం చేస్తాం: వివేకానంద

1
- Advertisement -

నిన్న తెలంగాణ సోషల్ జస్టిస్ డే కాదు ఇంజస్టిస్ డే అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేపీ వివేకానంద. నిన్న బడుగు బలహీన వర్గాలకు చీకటి రోజు ..సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో బాగా నటించారు …ఈ నటనను బీసీ లు ఎవ్వరూ నమ్మరు అన్నారు. 1952 లో బడుగు బలహీన వర్గాల కోసం ఖేల్కర్ కమిటీ మంచి సూచనలు చేసింది..ఆ సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు అన్నారు.

రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో మానసిక ఉన్మాది లా ప్రవర్తించారు ..కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ కు మంగళం పాడారు ..నీలం సంజీవ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకు అందరూ కాంగ్రెస్ సీఎం లు బీసీ లకు మోసం చేసిన వారే ..రాజీవ్ గాంధీ పార్లమెంట్ లో ఓబీసీ రిజర్వేషన్లకు ,కులగణన కు వ్యతిరేకంగా మాట్లాడారు .ఈ రికార్డులు బయట పెడతాం ..రేవంత్ రెడ్డి అబద్దాలతో అధికారం లోకి వచ్చారు .ఇపుడు ఫాల్స్ సర్వే తో బీసీ లను మోసం చేస్తున్నారు అన్నారు.

తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి కి తగిన గుణ పాఠం చెబుతుంది ..బీసీ లకు జరిగిన అన్యాయాన్ని బీ ఆర్ ఎస్ ఆషామాషీ గా తీసుకోదు..బీసీ ల పక్షాన బీ ఆర్ ఎస్ పోరాడుతుంది ..కాంగ్రెస్ సిద్ధాంతమే బలహీన వర్గాల వ్యతిరేక సిద్ధాంతం ..రాహుల్ గాంధీ పార్లమెంటు లో మాట్లాడటం కోసమే హడావుడిగా కుల గణన సర్వే బయట పెట్టింది ..దళిత సంఘాలు ఆందోళనగా ఉన్నాయని ఎస్సీ వర్గీకరణ పై అసెంబ్లీ లో చర్చించారు ..కానీ చిత్తశుద్ధి లేదు..కేసీఆర్ తో చర్చించి బీసీ ల కోసం పెద్ద ఉద్యమం చేస్తాం అన్నారు.

Also Read:TTD:అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు

- Advertisement -