తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే దిక్సూచి కానుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో కులగణన సర్వే 2024ను ప్రవేశపెట్టారు రేవంత్ రెడ్డి. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టినట్లు వెల్లిడించారు.
ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 96.9 శాతం మంది పాల్గొన్నారని .. ఈ కులగణన ఆధారంగా రాష్ట్రంలో 56.25 శాతం మంది బీసీలు ఉన్నట్లు వెల్లడైందన్నారు. ముస్లిం మైనార్టీలో బీసీలు 10.08 శాతం ఉన్నారని, మొత్తం బీసీలు 56.33 శాతంగా ఉన్నారని అన్నారన్నారు. ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం ఉన్నట్లు ఈ సర్వే లెక్క తేల్చిందన్నారు.
ఈ సర్వే ఆధారంగానే రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఉద్యోగ నియామకాలు, రిజర్వేషన్లు అమలు అవుతాయని సీఎం స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన నివేదికల ఆధారంగా రాష్ట్రంలో సర్వే చేసినట్లు తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.
గతేడాది నవంబర్ 9వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు సర్వే జరిగినట్లు వెల్లడించారు. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి 36 రోజులు సమయం పట్టిందని, ఏడాదిలోపు సర్వేను విజయవంతంగా పూర్తి చేశామని సీఎం తెలిపారు.
Also Read:బీసీ గణన తప్పుల తడక: తలసాని