- Advertisement -
నల్గొండ బీజేపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. నాగం వర్షిత్ రెడ్డిని రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు బీజేపీ సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని మేనేజ్ చేసి పదవి తెచ్చుకున్నాడని.. అధ్యక్షుడిని మార్చకపోతే పార్టీ కార్యాలయం గడప కూడా తొక్కమని హెచ్చరించారు.
నిన్న పలు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించింది తెలంగాణ బీజేపీ. హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డి,భూపాల్ పల్లి అధ్యక్షుడిగా నిశిధర్ రెడ్డి,కామారెడ్డి అధ్యక్షుడిగా నీలం చిన్న రాజులు,హనుమకొండ అధ్యక్షుడిగా కొలను సంతోష్ రెడ్డి ,వరంగల్ అధ్యక్షుడిగా గంట రవికుమార్ ,నల్లగొండ అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డిని నియమించింది.
ఈ నేపథ్యంలో వర్షిత్ రెడ్డి నియామకంపై బీజేపీ సీనియర్లు మండిపడ్డారు.
Also Read:పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు
- Advertisement -